Hamida Bano | లాహోర్: ట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయి 22 ఏండ్లుగా పాకిస్థాన్లో ఉన్న భారతీయ మహిళ సోమవారం స్వదేశానికి చేరుకుంది. వాఘా సరిహద్దు నుంచి ఆమె భారత్లోకి ప్రవేశించిందని ఓ అధికారి తెలిపారు. బాధితురాలైన హమీదా బానో కథనం ప్రకారం ముంబైకి చెందిన ఆమె 2002లో పాకిస్థాన్లోని హైదరాబాద్కు వచ్చింది.
దుబాయ్లో వంట మనిషి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమెను మోసం చేసిన ఓ ట్రావెల్ ఏజెంట్ ఆమెను పాకిస్థాన్లో వదిలి పెట్టి వెళ్లిపోయాడు. ఆమె అక్కడే ఒక పాకిస్థానీని పెండ్లి చేసుకొంది. 2022లో స్థానిక యూట్యూబర్ ఆమె గురించి చేసిన వ్లాగ్ ఆమెను తిరిగి కుటుంబం దగ్గరకు చేరేలా చేసింది.