US Court | లాస్ ఏంజెల్స్: 21 ఏండ్ల పాటు సాగించిన న్యాయ పోరాటంలో అమెరికా కోర్టు సంచలన తీర్పు చెప్పింది. గుజరాత్‌కు చెందిన హరేశ్ జోగాని, శశికాంత్, రాజేశ్, చేతన్, శైలేష్ అమెరికాకు వలస వెళ్లారు. వజ్రాలు, రియల్ ఎస్టేట్ చేసి వేలాది కోట్ల డాలర్లు ఆర్జించారు.
అయితే హరేశ్ తమను మోసం చేశాడని, భాగస్వామ్య ఒప్పందాన్ని ఉల్లంఘించాడని మిగిలిన నలుగురు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు చెప్తూ నలుగురు సోదరులకు రూ.20 వేల కోట్లు చెల్లించాలని, దక్షిణ కాలిఫోర్నియాలోని దాదాపు 17 వేల అపార్ట్మెంట్ల రియల్ ఎస్టేట్‌ను విభజించి, పంపిణీ చేయాలని హరేశ్ను ఆదేశించింది.