అమెరికాలో మరో భారత యువకుడు మృతి
అమెరికాలో మరో భారత యువకుడు మరణించాడు. కాలిఫోర్నియాలోని ప్రముఖ గ్లేసియర్ పార్కులో నీట మునిగి ఐటీ ఉద్యోగి మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వాషింగ్టన్, జూలై 12: అమెరికాలో మరో భారత యువకుడు మరణించాడు. కాలిఫోర్నియాలోని ప్రముఖ గ్లేసియర్ పార్కులో నీట మునిగి ఐటీ ఉద్యోగి మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాలిఫోర్నియాలో పనిచేస్తున్న 26 ఏండ్ల సిద్ధాంత్ విఠల్ పాటిల్ జూన్ 6న తన స్నేహితులతో కలిసి మోంటన్నా రాష్ట్రంలోని ఈ పార్కులో ప్రమాదానికి గురయ్యాడు. అవలాంచ్ లేక్ ట్రయల్‌లో కొండగట్టుపైన హైకింగ్ చేస్తుండగా, అతను పెద్ద రాయి నుంచి పక్కనే ఉన్న చిన్న హిమానీనదంలో పడిపోయాడు.
అయితే రాయి నుంచి జారిపడ్డాడా, లేక బ్యాలెన్స్ తప్పి పడిపోయాడా అన్నది నిర్ధారణ కాలేదు. అతని మృతదేహం కోసం అధికారులు హెలికాప్టర్ల ద్వారా గాలింపు చేపట్టారు. అయితే నీటిలో దిగువకు కొట్టుకు వచ్చిన అతని వస్తువులు కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. రాళ్లు, చెట్ల మధ్య అతని మృతదేహం ఇరుక్కుని ఉండవచ్చునని వారు అనుమానం వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

