వాషింగ్టన్: భారత సంతతికి చెందిన రక్షణ రంగ నిపుణుడు, పలు అమెరికన్ ప్రభుత్వాలకు సలహాదారుగా పనిచేసిన ఆష్లే టెల్లిస్ (64) ను ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసింది.
దేశ రక్షణకు సంబంధించిన వేలాది రహస్య పత్రాలను చట్టవిరుద్ధంగా తన వద్ద ఉంచుకోవడంతోపాటు, చైనా అధికారులతో సీక్రెట్ మీటింగ్‌లు జరిపారన్న ఆరోపణలపై ఆయనను అరెస్టు చేసినట్టు తెలిసింది. జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో టెల్లిస్ పనిచేశారు. ప్రస్తుతం, వాషింగ్టన్ థింక్‌ట్యాంక్ అయిన కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌లో సీనియర్ ఫెలోగా ఉన్నారు.