ఒట్టావా: కెనడాలో భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యక్తి హర్‌ప్రీత్ సింగ్ ఉప్పల్ (41), ఆయన కుమారుడిని(11) శుక్రవారం కొందరు తుపాకీతో కాల్చి చంపారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఎడ్మంటన్‌లో రెండు గ్యాంగుల మధ్య కొంతకాలం విభేదాలు కొనసాగుతున్నట్టు సమాచారమున్నదని పోలీసులు చెప్పారు. 2021లో హర్‌ప్రీత్‌సింగ్, ఆయన కుటుంబసభ్యులను చంపడానికి ప్రయత్నం జరిగిందని తెలిపారు.