పెన్సిల్వేనియా: భారత సంతతి కుటుంబానికి చెందిన నలుగురు వృద్ధులు అమెరికాలో అదృశ్యమైన అయిదు రోజుల తర్వాత ఆదివారం విగత జీవులుగా కనిపించారు. కారు ప్రమాదంలో వారం తా మృతి చెందినట్టు మార్షల్ కౌం టీ షెరిఫ్ కార్యాలయం తెలిపింది. వాళ్లు ప్రయాణించిన కారును బిగ్ వీలింగ్ క్రీక్ రోడ్డు కట్ట నుంచి చీలిపోయిన గట్టులో కూలిపోయి ఉన్నట్టు కనుగొన్నారు.
అది మారుమూల ప్రాంతం కావడంతో రక్షణ బృందాలు అక్కడికి చేరుకోవడానికి అయిదు గంటలు పట్టింది. మృతులంతా 80 ఏండ్ల పైబడిన వారని.. వారంతా మార్షల్ కౌంటీలో ఇస్కాన్ వ్యవస్థాపకుడి అనుచరులు అభివృద్ధి చేసిన బంగారు మందిర దర్శనానికి వెళుతుండగా ఈ ప్రమా దం జరిగినట్టు తెలిసింది. జూలై 29 నుంచి నలుగురు వృద్ధుల్లో ఎవరూ ఫోన్లలో మాట్లాడలేదని చివరిసారిగా వారంతా ఎరీలోని బర్గర్ కింగ్ అవుట్ లెట్లో కనిపించారని స్థానిక మీడియా తెలిపింది.