e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News కెనడా రక్షణ మంత్రిగా అనితా ఆనంద్‌

కెనడా రక్షణ మంత్రిగా అనితా ఆనంద్‌

టొరంటో: భారత సంతతికి చెందిన అనితా ఆనంద్‌ కెనడా నూతన రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రధాని జస్టిన్‌ ట్రుడో రక్షణ మంత్రిగా అనితా ఆనంద్‌ను నియమించారు. సైన్యంలో లైంగిక దుష్ప్రవర్తన సంక్షోభాన్ని నిలువరించడంలో విఫలమయ్యాడనే ఆరోపణల నేథ్యంలో సుదీర్ఘకాలం రక్షణ మంత్రిగా పనిచేసిన Indian origin హర్జిత్‌ సజ్జన్‌ స్థానంలో ప్రధాని ట్రుడో ఆమెను ఎంపికచేశారు.

దేశంలో ప్రముఖ న్యాయవాది అయిన 54 ఏండ్ల అనితా ఆనంద్‌.. గత నెలలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఓక్‌విల్లే నుంచి 46 శాతం ఓట్లతో గెలుపొందారు. గత మంత్రివర్గంలో ఆమె వ్యాక్సిన్‌ మినిస్టర్‌గా పనిచేశారు. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ రంగంలో ఆమెకు సుదీర్ఘ అనుభవం ఉన్నది. దీంతో లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆర్మీలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు అనితను రక్షణ మంత్రిగా ఎంపికచేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement