Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Rohan Rane: అమ్మాయిలను పరిచయం చేసుకుని, వారి నగ్న వీడియోలను ఆన్లైన్ పెట్టి, వారిని చిత్ర హింస పెట్టిన కేసులో ఫ్రాన్స్ కోర్టు 29 ఏళ్ల భారతీయుడు రోహన్ రాణేకు 20 జైలుశిక్ష విధించింది. అమెరికా, బ్రిటన్, కెనడాలో అతని బాధితులు ఉన్నారు.
పారిస్: ఫ్రాన్స్‌లో 29 ఏళ్ల భారతీయ వ్యక్తి రోహన్ రాణే(Rohan Rane)కు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది పారిస్ కోర్టు. మైనర్ అమ్మాయిలను వేధించి, వాళ్ల వీడియోలను ఆన్లైన్లో పోస్టు చేస్తున్న కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని కేసుల్లో ఆ అమ్మాయిలను చిత్రహింస పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిని నియో నాజీ లవర్‌గా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. పురుషాధిక్య హింసకు పాల్పడినట్లు పేర్కొన్నారు. రాణేకు చెందిన గ్రూపులో ఎక్కువ శాతం అమెరికా అమ్మాయిలు ఉన్నట్లు తెలిసింది. బాధితుల్లో 15 ఏళ్ల లోపువారే ఎక్కువగా ఉన్నారు. అమెరికా, ఇండియా, జర్మనీ, న్యూజిలాండ్ దేశాలకు చెందిన పురుషులతోనూ ఆన్లైన్ గ్రూపును నిందితుడు మెయిన్టేన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆరు మంది అమ్మాయిలు అతనిపై ఫిర్యాదు చేశారు. మరో 20 మంది బాధితులను గుర్తించారు.
వ్యవస్థీకృత నేరానికి పాల్పడిన రాణే బాధితుల నుంచి డబ్బులు వసూల్ చేసినట్లు కోర్టు పేర్కొన్నది. సీవీఎల్టీ గ్రూపు పేరుతో అమ్మాయిలను నిందితుడు ఆకర్షించినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు. కోవిడ్19 మహమ్మారి వేళ గ్రూపు యాక్టివ్‌గా మారింది. ఫ్రాన్స్‌లో చదువుకునేందుకు రాణే వెళ్లారు. అయితే మానసికంగా కృంగిపోయిన బాధితులను ఆన్లైన్లో పరిచయం చేసుకుని వారి నుంచి నగ్న చిత్రాలను సేకరించేవాడు. ఒకవేళ తమ డిమాండ్లను అంగీకరించకుంటే, కుటుంబీకులకు, స్నేహితులకు చెబుతామని బెదిరించేవాడు.
నల్లజాతి లేదా యూద అమ్మాయిలు బాధితుల్లో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. లైంగిక వాంఛలు తీర్చడం లేదా కత్తితో శరీరంపై కాట్లు పొడిచే రీతిలో ప్రేరేపించేవాడు. నాజీ స్విస్తిక్ గుర్తును శరీరంపై ముద్రించేలా చేసేవాడు. 2012లో రాణేను ఫ్రాన్స్‌లో తొలిసారి అరెస్టు చేశారు. సీవీఎల్టీ గ్రూపు గురించి అమెరికా అధికారులు తొలుత ఫ్రాన్స్‌కు సమాచారం ఇచ్చారు. 12 ఏళ్ల అమ్మాయి శరీరంపై రోహన్ అని రాసి ఉన్న ఫోటోలు అమెరికా పోలీసులకు చిక్కాయి. దీంతో ఆ కేసులో కూపీ లాగారు. బాధితులు, సాక్షులకు బెదిరింపులు రావడంతో కేసును సీరియస్‌గా తీసుకున్నారు. రాణేను అప్పగించాలని ఫ్రాన్స్‌ను అమెరికా కోరింది. బ్రిటన్, కెనడాలో కూడా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

