షికాగో: విమానం గాలిలో ఉండగా ఒక భారతీయ యువకుడు తీవ్ర గందరగోళం సృష్టించాడు. ఇద్దరు టీనేజర్లపై ఫోర్క్‌తో దాడి చేయడమే కాక, విమాన సిబ్బందిలో ఒకరిని చెంపదెబ్బ కొట్టాడు. షికాగో నుంచి ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ)కు వెళుతున్న లుఫ్తాన్సా విమానంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విమానాన్ని బోస్టర్ లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు తరలించి అత్యవసర ల్యాండింగ్ చేశారు.
సీఎన్ఎన్ కథనం ప్రకారం 28 ఏండ్ల ప్రణీత్ కుమార్ తన పక్క సీట్లో ఉన్న 17 ఏండ్ల ఇద్దరిపై ఒక మెటల్ ఫోర్క్‌తో వారి భుజాలపై, తలపై పొడిచి గాయపరిచాడు.