శనివారం 23 జనవరి 2021
International - Dec 19, 2020 , 13:28:54

జో బైడెన్ బృందంలో మరొక భారతీయుడు

 జో బైడెన్ బృందంలో మరొక భారతీయుడు

వాషింగ్ టన్ :అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా ప్రవాస భారతీయుడు వేదాంత్ పటేల్ ను నియమించారు. బైడెన్ శిబిరంలో పటేల్ సీనియర్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆయన ప్రచారవర్గంలో రీజనల్ కమ్యూనికేషన్ డైరెక్టర్ గాను, అంతకుముందు నెవాడా-వెస్టర్న్ ప్రైమరీ స్టేట్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గా, ఒకప్పుడు ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ ఎంపీ ప్రమీలా జయపాల్ కు కూడా ఇదే హోదాలో డైరెక్టర్ గా ఆయన వ్యవహరించారు. ఇండియాలో పుట్టి కాలిఫోర్నియాలో పెరిగిన వేదాంత్ పటేల్.. ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్, ప్రెస్ స్టాఫ్ కోసం బైడెన్ ప్రకటించిన 16 మందిలో పటేల్ ఒకరు. ఈ టీమ్ అంతా వారివారి రంగాల్లో ప్రతిభగలవారని వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాన్ తెలిపారు. 

ఇవి కూడా చదవండి... వేగం పుంజుకోనున్నభారత ఆర్థికవ్యవస్థ...

  పెరిగిన పసిడి ధరలు... ఎంతంటే..?

'శ్రీ గురు తేఘ్‌ బహదూర్‌ జీ'కి ప్రదాని మోడీ నివాళులు

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి


logo