గోల్డెన్ గేట్ బ్రిడ్జిపైనుంచి దూకి ఇండియన్ అమెరికన్ ఆత్మహత్య
Golden Gate Bridge | అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో విషాదం చోటుచేసుకున్నది. భారత సంతతికి చెందిన యువకుడు శాన్ఫ్రాన్సిస్కోలోని ప్రసిద్ధ గోల్డెన్ గేట్ బ్రిడ్జి పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
వాషింగ్టన్: అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో విషాదం చోటుచేసుకున్నది. భారత సంతతికి చెందిన యువకుడు శాన్ఫ్రాన్సిస్కోలోని ప్రసిద్ధ గోల్డెన్ గేట్ బ్రిడ్జి పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వంతెనపై అతని సైకిల్, ఫోన్, బ్యాగ్ లభ్యమయ్యాయని అమెరికా కోస్టల్ గార్డ్స్ అధికారులు తెలిపారు. పన్నెండో తరగతి చదువుతున్న 16 ఏండ్ల ఇండియన్ అమెరికన్.. బుధవారం సాయంత్రం 4.58 గంటల సమయంలో బ్రిడ్జిపై నుంచి దూకాడని చెప్పారు. వెంటనే తాము గాలింపు చేపట్టామని వెల్లడించారు.
గోల్డెన్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ భారతీయ అమెరికన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇది నాలుగోసారని ఎన్నారై అజయ్ జైన్ భూటోరియా తెలిపారు. కాగా, 1937లో ప్రారంభమైన ఈ బ్రిడ్జిపై నుంచి ఇప్పటివరరు 2 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో గతేడాది 25 మంది ఉన్నారు. అయితే తరచూ ఇక్కడ ఆత్మహత్య కేసులు నమోదవుతుండటంతో వంతెనకు ఇరువైపులా 20 అడుగుల వెడల్పుతో ఇనుప మెష్‌ను నిర్మిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

