Vivek Ramaswamy | ఆరు రోజుల్లో 42 ప్రచార కార్యక్రమాలు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో వివేక్ రామస్వామి దూకుడు
Vivek Ramaswamy | అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవడం కోసం భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రిపబ్లిక్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న ఆయన.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
Vivek Ramaswamy | అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవడం కోసం భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రిపబ్లిక్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న ఆయన.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కేవలం ఆరు రోజుల్లోనే 42 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. వచ్చేవారం కూడా 38 ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. ఈ మేరకు యూఎస్ఏ టుడే ఒక కథనం వెల్లడించింది. ప్రచార కార్యక్రమాల్లో వివేక్ రామస్వామి చురుగ్గా పాల్గొంటున్నారని.. మిగిలిన అభ్యర్థులతో పోలిస్తే చాలా ముందున్నారని పేర్కొంది.
కాగా, ఇంత ఉత్సాహంగా ప్రచారాల్లో పాల్గొంటున్నారని వివేక్ రామస్వామిని యూఎస్ఏ టుడే ఒక ప్రశ్న సంధించింది. దీనికి ఆయన కూడా ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. తన ప్రచారానికి వస్తున్న ప్రజాదరణను చూస్తుంటే.. నూతనోత్తేజం పొంగుకొస్తుందని తెలిపారు. దేశం పట్ల వాళ్లకు ఉన్న శ్రద్ధే తనను ఇంతగా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రచార కార్యక్రమాల ద్వారా ఒక బలమైన కమ్యూనిటీ నిర్మాణం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. టీవీలు, సోషల్‌మీడియాల్లో ప్రచారం చేసినా కూడా ఈస్థాయి ప్రచారం జరగడం అసాధ్యమని పేర్కొన్నారు. పార్టీ విరాళాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం కంటే కూడా పిజ్జా అవుట్లెట్ల వద్ద సాధారణ ప్రజలతో ముచ్చటించడమే ఉత్తమమైన మార్గమని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజలతో మమేకం కావడానికి ఇదే సరైన మార్గమని అభిప్రాయపడ్డారు. రిపబ్లిక్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఎన్నికవ్వడం పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

