శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 30, 2020 , 07:52:41

రష్యా సైనిక విన్యాసాల్లో పాల్గొనం.!

రష్యా సైనిక విన్యాసాల్లో పాల్గొనం.!

న్యూఢిల్లీ : వచ్చే నెల రష్యాలో నిర్వహించబోతున్న వ్యూహాత్మక సైనిక విన్యాసాల్లో పాల్గొనవద్దని భారత్‌ నిర్ణయించింది. ఆ కార్యక్రమంలో పాకిస్థాన్‌, చైనా సైన్యాలు కూడా పాల్గొంటున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్రప్రభుత్వ వర్గాలు శనివారం తెలిపాయి. దక్షిణ రష్యాలోని అస్ట్రాఖాన్‌ ప్రాంతంలో సెప్టెంబర్‌ 15 నుంచి 26వ తేదీ మధ్య బహుపాక్షిక వ్యూహాత్మక సైనిక విన్యాసాలు జరుగనున్నాయి. వీటిలో తాము పాల్గొంటామని గతవారం భారత్‌.. రష్యాకు సమాచారం అందించింది. అయితే, దాంట్లో పాల్గొనవద్దని తాజాగా నిర్ణయించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo