Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం.. ఈ-వీసాలు ప్రకటించిన ఇండియా

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan )లో చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా ఇండియాకు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎమర్జెన్సీ వీసా పద్ధతిని ప్రకటించింది. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో ఇండియాలో ఆశ్రయం పొందాలనుకునేవారికి ఆ వీసాలను జారీ చేయనున్నారు. “e-Emergency X-Misc Visaష పేరుతో కేంద్ర హోంశాఖ ఆ వీసాలను జారీ చేయనున్నది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్ చేరుకోవాలనుకునేవారికి ఆ వీసా ద్వారా అవకాశం కల్పించనున్నారు. అయితే హిందువులు, సిక్కులకు ఈ-వీసాలో తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్ ఫైటర్లు చేజిక్కించుకున్న నేపథ్యంలో ఆ దేశం విడిచి వెళ్లేందుకు వేలాది సంఖ్యలో జనం కాబూల్ విమానాశ్రయానికి వస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన ఘటనలో అయిదుగురు మరణించారు.
ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడారు. ఆఫ్ఘన్ శరణార్థులకు ప్రపంచ దేశాలు ఆశ్రయం కల్పించాలన్నారు. ఆఫ్ఘన్ శరణార్ధులను అన్ని దేశాలు ఆహ్వానించాలని, వారిని డిపోర్ట్ చేయరాదు అని ఆయన ఓ ట్వీట్లో తెలిపారు. ఇప్పటికే కొన్ని దేశాలు ఆశ్రయం కల్పించేందుకు అంగీకరించాయి. 20 వేల మంది పేద ఆఫ్ఘన్లకు ఆశ్రయం ఇవ్వనున్నట్లు కెనడా చెప్పింది. మరోవైపు కాబూల్‌లో భారత రాయబార కార్యాలయాన్ని మూసివేనట్లు భారత్ ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrababu | తెలంగాణ సెక్రటేరియట్‌లా కనిపిస్తుందంటూ చంద్రబాబు ప్రశంసలు
Revanth Reddy | సీఎం ఇలాకాలో గుడిపైకి బుల్డోజర్.. నందిపహాడ్లో దుర్మార్గం
సంకీర్ణాన్నిశాసించి పథకాలెన్నో సాధించి.. గడిచిన నాలుగు దశాబ్దాల్లో రుజువైందిదే!
Delimitation Bill | మారిన మద్దతు లెక్కలు.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ఎన్డీయే ‘మిషన్ 360’
Delimitation Bill | చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగా సీట్ల పెంపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

