రెండో పెళ్లి.. ఆహా ఈ మాట వింటేనే కొంతమంది భర్తలకు చాలా ఇష్టం. భార్య బతికుండగానే రెండో పెళ్లి చేసుకునే చాన్స్ ఉంటే ఎంత బాగుండేదో అని అనుకుంటూ ఉంటారు. భారతదేశంలో రెండో పెళ్లి చట్టరీత్యా నేరం. కానీ, ఆఫ్రికా ఖండంలోని ఎరిత్రియాలో మాత్రం ఇది నేరం కాదు. పైగా రెండో పెళ్లి చేసుకోక పోవడమే నేరం. ఇదెక్కడి విడ్డూరమని ఆశ్చర్యపోతున్నారా?
ఆఫ్రికా ఖండంలోని ఎరిత్రియా దేశంలో వెరైటీ వివాహ సంప్రదాయం ఉంది. ఇది వట్టి సంప్రదాయం మాత్రమే కాదు.. చట్టం కూడా. ఆ దేశంలో పుట్టిన ప్రతి పురుషుడూ తప్పనిసరిగా రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే. ఒకవేళ రెండో పెళ్లికి నో చెబితే కటకటాల్లోకి వెళ్లాల్సిందే. ఏకంగా జీవిత ఖైదు శిక్ష వేస్తారు. ఈ చట్టం కేవలం పురుషులకు మాత్రమే కాదు స్త్రీలకు కూడా వర్తిస్తుంది. ప్రతి స్త్రీ తన భర్త రెండో పెళ్లిని అంగీకరించాలి. మరో మహళతో కలిసి భర్తను పంచుకోవాలి. ఆమె ఇందుకు అంగీకరించకుంటే చట్టపరమైన చర్యలు తప్పవు. ఆ దేశంలో పుట్టిన పురుషులు, స్త్రీలు రెండు పెళ్లిళ్ల నిబంధనను చచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే.
ఎరిత్రియా దేశం ఈ రెండు పెళ్లిళ్ల నిబంధనను ఏదో తమాషాకు పెట్టలేదు. దీని వెనుక బలమైన కారణమే ఉంది. ఆ దేశంలో పురుషుల కంటే స్త్రీ జనాభా చాలా ఎక్కువ. దీంతో చాలామంది స్త్రీలు పెళ్లికాకుండా మిగిలిపోయే ప్రమాదం ఉంది. స్త్రీ, పురుష నిష్పత్తిలోనూ చాలా తేడా వస్తున్నది. ఈ నిష్పత్తిని సమం చేసేందుకు ఎరిత్రియా రెండు పెళ్లిళ్ల నిబంధనను తీసుకొచ్చింది. కొత్త చట్టమే చేసింది. దీని ప్రకారం.. ఒకే భార్యను కలిగి ఉన్న వ్యక్తిని దోషిగా చూస్తారు. ఈ చట్టంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తినా ఎరిత్రియా వెనక్కుతగ్గడం లేదు. తమ దేశంలో స్త్రీ, పురుష నిప్పత్తిని బ్యాలెన్స్ చేసేందుకు ఇంతకంటే మంచి మార్గం లేదంటోంది.