తనను అధికారం నుంచి దింపేయడానికి విదేశీ శక్తులు కుట్ర పన్నాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్లో బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్ కేబినెట్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. విదేశీ శక్తుల విషయం తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించిన లెటర్‌ను మంత్రుల ముందు ఉంచినట్లు తెలుస్తోంది. అలాగే జర్నలిస్టులకు కూడా ఈ లేఖను చూపించారు. తాను చూపిన ఈ డాక్యుమెంట్ చాలా ప్రామాణికమైందని ఇమ్రాన్ నొక్కి చెప్పారు.
తనను అధికారం నుంచి దింపేయడానికి విదేశీ శక్తులు కుట్రలు పన్నాయని ఓ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే తనను గద్దె దింపడానికి విదేశీ నిధులు కూడా వచ్చాయని సంచలన ప్రకటన చేశారు.