ఇస్లామాబాద్: ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ ఎంపీల(PTI Lawmakers)కు యాంటీ టెర్రరిజం కోర్టు బెయిల్ మంజూరీ చేసింది. తక్షణమే ఆ ఎంపీలను రిలీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇస్లామాబాద్‌లో 8వ తేదీన పార్లమెంట్ హౌజ్ నుంచి 10 మంది ఎంపీలను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆ కేసులో యాంటీ టెర్రరిజం జడ్జి అబ్దుల్ హస్నత్ జుల్కర్నైన్ వాదనలు విన్నారు. ఆ తర్వాత ఆయన అరెస్టు నుంచి రక్షణ పొందారు. పీటీఐ ఎంపీలను ఇస్లామాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వారిపై సంజ్జానీ పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో షేర్ అఫ్జల్ ఖాన్, మాలిక్ మొహమ్మద్ ఆమిర్ డోగర్, మొహమ్మద్ అహ్మద్ చత్తా, మక్దూమ్ జైన్ హుస్సేన్ కురేషీ, వకాస్ అక్రమ్, జుబైన్ ఖాన్, అవాసీ హైదర్ జాఖర్, సయ్యిద్ షా అహద్ అలీ షా, నసీమ్ అలీ షా, యూసఫ్ ఖాన్ ఉన్నారు. రూ.30 వేల బాండ్‌పై బెయిల్ మంజూరీ చేశారు.