ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ మహిళతో మాట్లాడుతూ ఆమెను తాకే ప్రయత్నం చేయగా మహిళ వెనక్కి జరిగిన వీడియోను ఇమ్రాన్ మాజీ భార్య రేహం ట్విటర్ లో పోస్ట్ చేశారు. మహిళల ప్రైవసీపై పురుషులు దాడిచేయరాదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలు పేదవారైనా వారు అమాయకులు కాదని..వారితో గౌరవప్రదంగా వ్యవహరించాలని 18 సెకండ్ల నిడివికలిగిన వీడియోను షేర్ చేస్తూ ఆమె పేర్కొన్నారు.
కాగా రెహం ఖాన్ పోస్ట్ ను పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారి రీట్వీట్ చేశారు. రాజకీయ నేతగా మారిన క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ 1995లో బ్రిటిష్ బిలియనీర్ కుమార్తె జెమిమ గోల్డ్ స్మిత్ ను పెండ్లి చేసుకుని ఆమెతో తొమ్మిదేండ్లు కలిసి ఉన్నారు. ఆపై బ్రిటిష్-పాకిస్తానీ జర్నలిస్టు రేహంతో ఏడడుగులు నడవగా వారి కాపురం కేవలం పది నెలలే సాగింది. ఇక ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ తన ఆథ్యాత్మిక గురు బుష్రా మనేకతో వైవాహిక జీవితం గడుపుతున్నారు.
Men must not invade personal space of a woman. Woman flinches in video below. Also has to be told that it’s “Mine” not Benazir’s income support. People might be poor but they are not idiots & must be treated with dignity. Self promotion doesn’t fool people pic.twitter.com/RNXFvDDbWU
— Reham Khan (@RehamKhan1) May 24, 2021