Shah Mehmood Qureshi | ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు, పాక్ మాజీ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీ అరెస్ట్
Shah Mehmood Qureshi | గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ (Pakistan)లో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొంది. పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ (PTI) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ను మంగళవారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, ఇమ్రాన్ సన్నిహితుడు షా మహమూద్ ఖురేషీ (Shah Mehmood Qureshi) ని పోలీసులు అరెస్టు చేశారు.
Shah Mehmood Qureshi | గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ (Pakistan)లో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొంది. అవినీతి కేసులో నాటకీయ పరిణామాల మధ్య పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ (PTI) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ను మంగళవారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, ఇమ్రాన్ సన్నిహితుడు షా మహమూద్ ఖురేషీ (Shah Mehmood Qureshi) ని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున ఇస్లామాబాద్‌లో ఖురేషీని అదుపులోకి తీసుకున్నట్లు పీటీఐ తెలిపింది. అరెస్టు అనంతరం ఖురేషీని రహస్య ప్రాంతానికి తరలించింనట్లు పేర్కొంది.
కాగా, అవినీతి కేసు విచారణ నిమిత్తం ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చిన ఇమ్రాన్‌ఖాన్‌ను పారామిలటరీ రేంజర్స్ కోర్టు ఆవరణ నుంచి బలవంతంగా లాక్కెళ్లి మరీ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా కోర్టు విచారణ చేపట్టారు. అవినీతి కేసులపై ఇమ్రాన్ ఖాన్‌ను ప్రశ్నించేందుకు పది రోజులు తమ కస్టడీకి అప్పగించాలని ఎన్ఏబీ కోర్టును కోరింది. అయితే 8 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నెల 17న ఇమ్రాన్ ఖాన్‌ను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది.
اسلام آباد پولیس کی جانب سے وائس چیئرمین تحریک انصاف مخدوم شاہ محمود قریشی کو گرفتار کر کے نامعلوم مقام پر منتقل کر دیا گیا ہے۔ #PakistanUnderSiege pic.twitter.com/R5cuLIc9UE
— PTI (@PTIofficial) May 11, 2023
Also Read..
Sanna Marin | మూడేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి.. విడాకులకు దరఖాస్తు చేసుకున్న ఫిన్లాండ్ ప్రధాని
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

