ఇస్లామాబాద్: అవినీతి కేసుల్లో అరెస్టయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రశ్నించేందుకు ఇస్లామాబాద్‌లోని ఓ కోర్టు బుధవారం అనుమతించింది. ఆ దేశ అవినీతి నిరోధక విభాగానికి ఇమ్రాన్‌ను 8 రోజుల కస్టడీకి అప్పగించింది. పోలీసులు తనను హింసించారని, శౌచాలయానికి వెళ్లనివ్వలేదని ఇమ్రాన్ కోర్టుకు తెలిపారు. తనకు నిదానంగా గుండెపోటు వచ్చేలా సూదిమందు వేశారని ఇమ్రాన్ ఆరోపించారు. ఈ నెల 17న తదుపరి విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. తాను తిరిగి అధికారంలోకి రాకుండా ఉండేందుకే అసంఖ్యాకమైన కేసులు తనపై మోపారని ఆరోపించారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపేసి, సోషల్ మీడియా వాడకంపై హోంశాఖ నియంత్రణలు విధించింది.