ఇస్లామాబాద్: తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలి రోజు నుంచే ఇలాంటి కుట్ర జరుగుతోందంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ బాలీవుడ్ సినిమా క్లిప్‌ను పోస్ట్ చేశారు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ వీడియో పోస్ట్ చేయగా.. అది కాస్తా రచ్చ రచ్చ అయింది. ప్రతిపక్షాలతోపాటు నెటిజన్లు కూడా ఆడుకోవడంతో ఆయన ఆ వీడియోను డిలీట్ చేశారు. అయితే జర్నలిస్ట్ నైనా ఇనాయత్ ఆ వీడియోను క్యాప్చర్ చేసి తన ట్విటర్లో పోస్ట్ చేశారు.
1984లో వచ్చిన బిగ్ బీ అమితాబ్ మూవీ ఇంక్విలాబ్లోని సీన్ అది. అందులో ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలో విలన్ తన పార్టీ సభ్యులకు చెబుతుంటాడు. దేశంలో అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని అంటాడు. కచ్చితంగా పాకిస్థాన్‌లోనూ తన ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి తొలి రోజు నుంచే ఇలాంటి కుట్ర జరుగుతోందని కామెంట్ చేస్తూ ఇమ్రాన్ ఈ వీడియో క్లిప్ పోస్ట్ చేశారు. ఇదే వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేస్తూ గుడ్ బాలీవుడ్ పీఎం ఇమ్రాన్ ఖాన్‌ను కాపాడటానికి వచ్చిందంటూ కామెంట్ చేశారు.
దీనిపై నెటిజన్లు ఇమ్రాన్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. బాలీవుడ్‌ను దిగజారుడు ఫిల్మ్ ఇండస్ట్రీగా చెప్పిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడవే బాలీవుడ్ సినిమాను పొలిటికల్ లెక్చర్ల కోసం వాడుకోవడం ఏంటని కొందరు ప్రశ్నించారు.
😂😂
— Naila Inayat (@nailainayat) April 20, 2021
Few days ago, Imran Khan was lecturing us on the decadence of Bollywood. Today, he is using Bollywood movies to teach political morality. Its exhausting to keep track of his U-Turns.
— Ammar Ali Jan (@ammaralijan) April 20, 2021
You know things have reached a breaking point when Imran Khan uses a clip from a Bollywood film to make a political point on his official, verified Insta account 😂😂😂 https://t.co/uZJJuaEgHn
— Hasan Zaidi (@hyzaidi) April 20, 2021