అవిశ్వాసంపై నేడు ఓటింగ్
ఇస్లామాబాద్, ఏప్రిల్ 2: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆదివారం ఓటింగ్ జరగనున్నది. ఏదైనా అనూహ్యం జరిగితే తప్ప ఈ పరీక్షలో ఇమ్రాన్ ఓడిపోవడం, ప్రధాని పదవి నుంచి దిగిపోవడం దాదాపు ఖాయమే. ఇమ్రాన్ నేతృత్వం వహిస్తున్న పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీకి మద్దతిస్తున్న రెండు పార్టీలు విపక్షాల కూటమిలో చేరడంతో ఇమ్రాన్ గద్దె దిగక తప్పని పరిస్థితి.
342 మంది సభ్యులున్న పాక్ లోక్‌సభలో ఇమ్రాన్‌కు 172 మంది మద్దతు అవసరం. తమకు 175 మంది మద్దతు ఉందని ఇప్పటికే విపక్ష కూటమి ప్రకటించింది. ఈ నేపథ్యంలో శనివారం ఆయన పాక్ యువతను ఉద్దేశించి మాట్లాడారు. విదేశీ కుట్రపై మౌనం తగదన్నారు. ఆదివారం శాంతియుత నిరసనలు తెలుపాలని యువతను కోరారు. ఆర్మీపై తాను ఎలాం టి విమర్శలు చేయనన్నారు. పాకిస్థాన్‌లో ఇంతవరకు ఏ ఒక్క ప్రధాని కూడా ఐదేండ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోలేదు. కాగా, భారత్, చైనాతో ఉన్న వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటామని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖామర్ జావెద్ బజ్వా చెప్పారు. దీన్నిబట్టి ఇమ్రాన్‌కు పదవిగండం తప్పదని చెబుతున్నారు.