ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. అరెస్ట్ కాకుండా బెయిల్ ఇచ్చిన లాహోర్ హైకోర్టు
సోమవారం బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ భారీ బలప్రదర్శన నిర్వహించారు. తన పార్టీ అయిన పాకిప్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి కోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా వేలాది మంది పార్టీ మద్దతుదారులు ఆయనతోపాటు కలిసి వచ్చారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట లభించింది. ఆయనను అరెస్ట్ చేయకుండా లాహోర్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 70 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, పార్టీ నిధుల వివరాలను దాచినందుకు గత ఏడాది జాతీయ అసెంబ్లీకి అనర్హుడయ్యారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా భారీ నిరసనలకు ఆయన పార్టీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ ఎన్నికల సంఘం కార్యాలయం వెలుపల జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీనికి సంబంధించి ఇమ్రాన్ ఖాన్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని ఇమ్రాన్ ఖాన్ చేసిన అభ్యర్థనను ఇస్లామాబాద్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు గత వారం తిరస్కరించింది. దీంతో ఆయన లాహోర్ హైకోర్టును ఆశ్రయించారు.
కాగా, సోమవారం బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ భారీ బలప్రదర్శన నిర్వహించారు. తన పార్టీ అయిన పాకిప్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి కోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా వేలాది మంది పార్టీ మద్దతుదారులు ఆయనతోపాటు కలిసి వచ్చారు. ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్ వెంట పార్టీ కార్యకర్తలు నడిచారు. ఆయన కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు కోర్టు వద్దకు భారీగా తరలివచ్చిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
چئیرمین تحریک انصاف کا زمان پارک سے لاہور ہائی کورٹ تک کے سفر کی ویڈیو فوٹیجز pic.twitter.com/E69DLeo2ZU
— PTI (@PTIofficial) February 20, 2023
https://twitter.com/SherySherlock/status/1627656487966486528?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1627656487966486528%7Ctwgr%5Ed8ab9ee4e743821e9de945ceb24d4ace042dd4d1%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Fworld%2Fstory%2Fpakistan-imran-khan-reaches-lahore-high-court-bail-plea-hearing-underway-2337261-2023-02-20
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

