Straw | బ్రస్సెల్స్ : పేపర్, వెదురు, ప్లాస్టిక్ స్ట్రాలను ఎక్కువగా వాడుతున్నారా? కూల్‌డ్రింక్స్, కొబ్బరిబొండాలను వాటితోనే తాగుతున్నారా?అయితే మీరు వాటి వాడకాన్ని వెంటనే తగ్గించండి. లేదంటే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. పేపర్, వెదురు, ప్లాస్టిక్ స్ట్రాల వాడకం హానికరమని బెల్జియం శాస్త్రవేత్తలు హెచ్చరించారు. స్ట్రాలలో హానికర పీఎఫ్ఏఎస్ రసాయనాలు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. పేపర్ స్ట్రాలో 90 శాతం, వెదురు స్ట్రాలో 85 శాతం, ప్లాస్టిక్‌లో 75 శాతం, గ్లాస్ స్ట్రాలో 40 శాతం వరకు పీఎఫ్ఏఎస్ పదార్థాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. వీటిలో ఉండే రసాయనాలు శరీరంలో ఉండే రసాయనాలతో కలిసి మరింత హానికరంగా మారుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. రసాయన అవశేషాలు ఏండ్ల తరబడి శరీరంలో ఉండిపోతాయని తెలిపారు. తద్వారా అనారోగ్యం పాలవుతారని పేర్కొన్నారు. ఈ రసాయనాలు నాన్‌స్టిక్ పాన్, కొన్ని ఆహార పదార్థాల్లోనూ ఉంటాయని హెచ్చరించారు.