IDF | సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసేందుకు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) కీలక నిర్ణయం తీసుకున్నది. లెఫ్టినెంట్ కల్నల్ అంతకంటే ఎక్కువ స్థాయి సీనియర్ అధికారులు ఇకపై అధికారిక కమ్యూనికేషన్స్ కోసం కేవలం ఐఫోన్స్‌ను మాత్రమే ఉపయోగించాలని ఆదేశించారు. భద్రతా కారణాల నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఫోన్స్‌ను పూర్తిగా నిషేధించారు. అనేక ఉల్లంఘనలు, సైన్యంలో సైబర్ గూఢచౌర్యం కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ డివైజెస్‌లో సైబర్ దాడులు పెరుగుతున్నట్లుగా ఇజ్రాయెల్ ఆర్మీ రేడియో, జెరూసలేం పోస్ట్ తెలిపాయి. ఇటీవలి సంవత్సరాల్లో సైనికులు, అధికారులను లక్ష్యంగా చేసుకుని అనేక హనీపాట్ దాడులు గుర్తించారు. సున్నితమైన డేటాను దొంగిలించడానికి ఫోన్లలో మాల్వేర్ను ఇంజెక్ట్ చేయడానికి నకిలీ ప్రొఫైల్‌లను ఉపయోగించారు.
కొత్త మార్గదర్శకాలు ఐఫోన్లను మాత్రమే సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించనున్నారు. ఆపరేషనల్, కమాండ్ సంబంధిత కార్యకలాపాల కోసం ఆండ్రాయిడ్ ఫోన్స్‌ను అనుమతించరు. ఇకపై ఆండ్రాయిడ్ పరికరాలు వ్యక్తిగత ఉపయోగానికి మాత్రమే అనుమతి ఉంటుంది. గూగుల్ ఇటీవల తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ (DoDIN) భద్రతా జాబితాలో చేర్చిందని పేర్కొన్న తర్వాతే.. ఈ నిర్ణయం వెలుగులోకి వచ్చింది. పిక్సెల్ అత్యాధునిక భద్రతా వ్యవస్థను కలిగి ఉందని గూగుల్ తెలిపింది. కానీ, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్.. ఐఫోన్ మూసివేసినా, నియంత్రిత పర్యావరణ వ్యవస్థ సురక్షితమని గుర్తించింది. నివేదికల ప్రకారం.. ఐడీఎఫ్ సంవత్సరాలుగా పలు సంవత్సరాలుగా అంతర్గత సెక్యూరిటీపై పలు ట్రయల్స్ నిర్వహించింది. ఈ ట్రయల్స్‌లో ఆండ్రాయిడ్ డివైజెస్‌లో లోపాలు ఉన్నట్లుగా తేలింది.