ప్రిన్స్ హ్యారీ
లండన్, జనవరి 5: బ్రిటిష్ ఆర్మీలో పైలట్‌గా పని చేసినప్పుడు అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశానని, ఇందులో 25 మంది మరణించారని ప్రిన్స్ హ్యారీ తెలిపారు. ఆయన ఆత్మకథగా వస్తున్న పుస్తకంలో ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. 2007 – 08లో ఎయిర్ కంట్రోలర్‌గా, 2012-13లో పైలట్‌గా ఈ దాడులు చేసినట్లు చెప్పారు. ఇందుకు తాను గర్వపడనని, అలాగని సిగ్గుపడనని పేర్కొన్నారు. అమెరికాపై జరిగిన 9/11 దాడుల్లో బాధితుల కుటుంబాలను తాను కలిశానని, ఆ గుర్తులకు ప్రతీకారంగా తాను అఫ్గాన్‌లో తాలిబన్ల లక్ష్యంగా జరిపిన దాడుల్లో పాల్గొన్నానని పేర్కొన్నారు. ప్రిన్స్ హ్యారీ పదేండ్ల పాటు బ్రిటిష్ ఆర్మీలో పని చేశారు.