కీవ్: ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణకు వెళ్లి 50 రోజులు గడిచింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఉక్రెయిన్ను డిఫెండ్ చేస్తున్న వారికి ఆయన గౌరవ నివాళి అర్పించారు. దేశ ప్రజలు ధైర్యంతో ఉన్నారన్నారు. 50 రోజుల యుద్ధాన్ని నిలదొక్కుకున్నామని, రష్యా దాడికి 50 రోజులు నిండిందన్నారు. ఈ 50 రోజుల్లో ప్రపంచ దేశాధినేతలు భిన్నరకాలుగా స్పందించారన్నారు. అనేక పశ్చిమ దేశాల నేతలతో సంప్రదింపులు జరిపినట్లు ఆయన గుర్తు చేశారు. కొందరు రాజకీయవేత్తలు తమ చేతుల్లో అధికారం లేనట్లు వ్యవహరించారని జెలెన్స్కీ అన్నారు. మేటి రాజకీయవేత్తల కన్నా రాజకీయాల్లో లేని వారు ఈ 50 రోజుల్లో ఎంతో చేశారని గుర్తు చేశారు. ఉక్రేయిన్ దళాలను ప్రశంసిస్తూ.. రష్యా యుద్ధ నౌకలు పాతాళానికి పోవాల్సిందే అన్నారు. 50 రోజులు మనం పోరాడం అంటే అది మన ఘనతే అన్నారు. ఇది లక్షల సంఖ్యలో ఉన్న ఉక్రేనియన్ల విజయం అన్నారు. ఫిబ్రవరి 24వ తేదీన అందరూ కీలక నిర్ణయం తీసుకున్నారని, పోరాటం చేయాలని, మనుషుల్లా మెదగాలని, తల వంచేదిలేదని, మోసం చేసేది లేదని జెలెన్స్కీ అన్నారు.