Sheikh Hasina | నేరగాళ్లు హీరోలు అవుతున్నారు.. నేను దేనికీ భయపడను : కోర్టు తీర్పు వేళ యూనస్ ప్రభుత్వంపై హసీనా సంచలన ఆరోపణలు
Sheikh Hasina | గతేడాది బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) అమానుష చర్యలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) నేడు తీర్పు వెలువరించనున్న విషయం (Court Verdict) తెలిసిందే.
Sheikh Hasina | గతేడాది బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) అమానుష చర్యలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) నేడు తీర్పు వెలువరించనున్న విషయం (Court Verdict) తెలిసిందే. ఈ తీర్పు వేళ హసీనా తాజాగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు. తన పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలను హసీనా కొట్టిపారేశారు. ‘నేను 10 లక్షల మంది రోహింగ్యాలకు ఆశ్రయం ఇచ్చాను. కానీ, వారు నన్ను మానవ హక్కులను ఉల్లంఘించానని ఆరోపిస్తున్నారు?’ అని అన్నారు.
ఐసీటీ తీర్పుకు ముందు తన మద్దతుదారులను ఉద్దేశించి హసీనా మాట్లాడారు. ఈ సందర్భంగా యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. యూనస్ ప్రభుత్వం తన పార్టీ అయిన అవామీ లీగ్‌ను పూర్తిగా నాశనం చేయాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. ‘మా పార్టీని నాశనం చేయడం అంత సులభం కాదు. అవామీ లీగ్.. అధికార దురాక్రమణదారుల జేబుల్లోంచి వచ్చిందికాదు. అట్టడుగు స్థాయి నుంచి పుట్టుకొచ్చింది’ అని ఆమె వ్యాఖ్యానించారు.
అవామీ లీగ్ పాలనలో దోపిడీలు, నేరాలను అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా షేక్ హసీనా తెలిపారు. అయితే, ఇప్పటి తాత్కాలిక ప్రభుత్వ హయాంలో నేరగాళ్లు హీరోలు అవుతున్నారని.. తనపై కుట్రలు పన్ని తప్పుడు కేసులు నమోదు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుట్రల వల్ల ఎంతో బాధతో తాను స్వదేశాన్ని వీడాల్సి వచ్చిందన్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని ఈ సందర్భంగా తన మద్దతుదారులకు సూచించారు.
‘కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందొద్దు. నేను బతికే ఉన్నాను. బతికే ఉంటాను. మళ్లీ ప్రజల సంక్షేమం కోసం పని చేస్తాను. బంగ్లాదేశ్ గడ్డపై న్యాయం చేస్తాను’ అని తెలిపారు. ‘తీర్పు రానివ్వండి. తీర్పు గురించి నాకు ఎలాంటి పట్టింపూ లేదు. నేను అలాంటి తీర్పులకు భయపడను. అల్లా నాకు జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని తీసుకుంటాడు. కానీ నేను నా దేశ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాను. నేను నా తల్లిదండ్రులను, తోబుట్టువులను కోల్పోయా. వారు నా ఇంటిని తగలబెట్టారు’ అని హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే దేశం మొత్తం లాక్డౌన్ తీసుకురావాలని ఈ సందర్భంగా తన కార్యకర్తలకు హసీనా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన అవినీతిపరుడు, ఉగ్రవాది, హంతకుడు అంటూ ఆరోపించారు. యూనస్ అధికారాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. హంతకులకు యూనస్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టిందన్నారు.
Also Read..
Sheikh Hasina | షేక్ హసీనాపై నేడు కీలక తీర్పు.. బంగ్లాలో హై అలర్ట్
IFFI | సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి.. రజినీకాంత్, బాలకృష్ణకు అరుదైన గౌరవం
Bomb Threats | సీఎం స్టాలిన్ సహా పలువురి నివాసాలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

