Organ Donation | న్యూయార్క్: అవయవ మార్పిడికి సం బంధించి అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు కొత్త విషయాన్ని కనుగొన్నారు. అవయవ మార్పిడి జరిగిన 47 మందిపై వీరు అధ్యయనం జరిపారు. ఇందులో దాదాపు సగం మందికి గుండె మార్పిడి జరగగా, మిగతా వారికి ఇతర అవయవాల మార్పిడి జరిగింది.
అవయవ మార్పిడి చేయించుకున్న వారిలో 89 శాతం మంది.. సర్జరీ తర్వాత తమలో మార్పులు వచ్చాయని వెల్లడించారు. ఆహారం, సంగీతం, కళల పట్ల తమ అభిరుచులు మారాయని పేర్కొన్నారు. కొందరిలో మతిమరుపు, ఆందోళన, నిరాశ, సైకోసిస్, శృంగార పరమైన సమస్యలు వచ్చాయని తెలిపారు. అవయవాన్ని స్వీకరించిన వారికి వస్తున్న కొన్ని జ్ఞాపకాలు వారి గతానికి సంబంధం లేనివని, అవయవ దాతకు సంబంధించినవని పరిశోధకులు గుర్తించారు.