న్యూయార్క్: ఆక్టోపస్‌లు చర్మం రంగు మార్చుకొని అదృశ్యత గుణాన్ని అలవర్చుకోగలవు. ఈ గుణాన్ని మనుషులకు కూడా జోడిస్తే ఎలా ఉంటుందనే దానిపై శాస్త్రవేత్తలు వినూత్న ఆలోచనకు తెరతీశారు.
ఆక్టోపస్ శరీర కణాల లాగే మనిషి కణాలను కూడా అలా మార్చాలని ప్రయత్నించే పనిలో పడ్డారు. అయితే, అదృశ్యత శక్తి పొందటం మనిషికి సాధ్యం కాదని, కాకపోతే మరిన్ని వినూత్న పరిశోధనలకు తమ ప్రయోగం ఉపయోగపడుతుందని వెల్లడించారు.