Israel-Iran Conflict | ఆ రెండు దేశాల మధ్య 45 ఏండ్ల వైరం!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం ఈ నాటిది కాదు. దాదాపు అర్ధ శతాబ్దం క్రితమే ఈ రెండు దేశాల మధ్య వైరం ప్రారంభమైంది. గతంలో అమెరికాతో జతకట్టిన పహ్లావీ రాజవంశం 1979లో ఇరాన్ విప్లవంతో అధికార పీఠాన్ని కోల్పోయింది. అనంతరం ఇరాన్ పాలనా పగ్గాలను చేపట్టిన అయతుల్లా ఖమేనీ వర్గం అమెరికా పట్ల దేశ వైఖరిని మార్చేసింది.
Israel-Iran Conflict | టెల్ అవివ్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం ఈ నాటిది కాదు. దాదాపు అర్ధ శతాబ్దం క్రితమే ఈ రెండు దేశాల మధ్య వైరం ప్రారంభమైంది. గతంలో అమెరికాతో జతకట్టిన పహ్లావీ రాజవంశం 1979లో ఇరాన్ విప్లవంతో అధికార పీఠాన్ని కోల్పోయింది. అనంతరం ఇరాన్ పాలనా పగ్గాలను చేపట్టిన అయతుల్లా ఖమేనీ వర్గం అమెరికా పట్ల దేశ వైఖరిని మార్చేసింది. అమెరికాను ‘మహా సాతాను’గా, ఇరాన్ చివరి చక్రవర్తి మొహమ్మద్ రెజా పహ్లావీకి మద్దతు తెలుపుతున్న ఇజ్రాయెల్‌ను ‘చిన్న సాతాను’గా అభివర్ణించింది. నాటి నుంచి టెహ్రాన్-టెల్ అవీవ్ మధ్య శత్రుత్వం క్రమంగా పెరగడంతో ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నదని ఖమేనీ ఆరోపించారు. దీంతో దశాబ్దాల నుంచే రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. కానీ, ఆ దాడుల్లో తమ ప్రమేయం లేదని రెండు దేశాలు ఖండించడంతో ఈ సంఘర్షణను ‘షాడో వార్’ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ షాడో వార్‌కు లెబనాన్, సిరియా యుద్ధవేదికలుగా ఆవిర్భవించాయి. లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్న హెజ్బొల్లా గ్రూపునకు ఇరాన్ అండగా నిలిచింది. మరోవైపు సిరియా భూభాగంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగడంతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు కూడా ఇరాన్ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో 1967 యుద్ధం తర్వాత సిరియాలోని గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించుకున్నది. నాటి నుంచి సిరియా, లెబనాన్‌పై దాడులు జరిపేందుకు గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ ఉపయోగించుకుంటున్నది.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడితో..
నిరుడు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన భీకర దాడుల్లో తమ పాత్ర లేదని ఇరాన్ బహిరంగంగా ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ దాడిని స్వాగతించింది. ఆ వెంటనే గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగడంతో ఇప్పటి వరకు 33 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృతిచెందినట్టు ఐక్యరాజ్య సమితి అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు హమాస్‌కు మద్దతుగా లెబనాన్ నుంచి హెజ్బొల్లా దళాలు ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 1న ఇజ్రాయెల్‌కు చెందినవిగా అనుమానిస్తున్న కొన్ని యుద్ధ విమానాలు సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై బాంబు దాడి చేశాయి. ఈ దాడిలో సీనియర్ కమాండర్లు సహా ఏడుగురు అధిదారులు మృతి చెందినట్టు ఇరాన్ వెల్లడించింది. దీనికి ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగానే తాజాగా ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

