బీరట్: ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇవాళ కీలక ప్రకటన చేశాయి. హిజ్బుల్లా(Hezbollah) నేత, ఆ సంస్థ సెక్రటరీ జనరల్ నయీమ్ ఖాసిమ్‌కు చెందిన పర్సనల్ సెక్రటరీ హతమైనట్లు వెల్లడించాయి. బీరట్పై బుధవారం జరిగిన దాడిలో నయీమ్ ఖాసిమ్ వ్యక్తిగత కార్యదర్శి హర్షి ప్రాణాలు కోల్పోయినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. తాలెట్ ఖయట్ ప్రాంతంపై ఐడీఎఫ్ బలగాలు నిన్న దాడి చేశాయి. అలీ యూసుఫ్ హర్షిని టార్గెట్ ఛేస్తూ ఆ దాడికి దిగాయి. హిజ్బుల్లా ప్రాబల్యం ఉన్న ప్రాంతంపై దాడి జరిగింది. ఆ దాడిలో ఓ బహుళ అంతస్తు బిల్డింగ్ నేలమైనట్లు వీడియోలు రిలీజ్ అయ్యాయి. అయితే ఖాసిమ్ మేనల్లుడే హర్షి. అతని పర్సనల్ సెక్రటరీ కూడా ఆయనే.
హిజ్బుల్లా సెక్రటరీ జనరల్ నయీమ్ ఖాసిమ్‌కు పర్సనల్ అడ్వైజర్ హర్షి అని, హిజ్బుల్లా నిర్వహణలో కీలక పాత్ర అతను పోషించాడని, ఆఫీసును, సెక్యూర్టీని మేనేజ్ చేసినట్లు ఐడీఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోకి ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తున్న లితాని నదిపై ఉన్న క్రాసింగ్లను పేల్చివేసినట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది. హిజ్బుల్లా దళాలు ఈ మార్గంలోనే వేల సంఖ్యలో ఆయుధాలు, రాకెట్లు, లాంచర్లను స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఐడీఎఫ్ చెప్పింది.
దక్షిణ లెబనాన్‌పై జరిగిన దాడిలో సుమారు 10 ఆయుధ డిపోలు, రాకెట్ లాంచర్లు ధ్వంసం అయ్యాయి. హిజ్బుల్లా ప్రధాన కార్యాలయాన్ని కూడా పేల్చివేసినట్లు మిలిటరీ పేర్కొన్నది.
🔴ELIMINATED: Ali Yusuf Harshi, the personal secretary to Hezbollah Secretary-General Naim Qassem in Beirut.
A close associate and personal advisor, Harshi played a key role in managing and securing Qassem’s office.
The IDF also struck two key crossings used by Hezbollah to…
— Israel Defense Forces (@IDF) April 9, 2026