న్యూఢిల్లీ: లెబనాన్ రాజధాని బీరట్‌లో జరిగిన దాడిలో హిజ్బొల్లా ఎలైట్ రద్వాన్ ఫోర్స్ కమాండర్(Hezbollah Commander) ఇబ్రహీం అఖిల్ మృతిచెందినట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. సీనియర్ కమాండర్ల మీటింగ్‌ను టార్గెట్ చేసి అటాక్ చేశారు. ఆ దాడిలో 14 మంది మరణించారు. దీంట్లో 10 మంది హై ర్యాంకింగ్ అధికారులు ఉన్నారు. 1983లో బీరట్‌లోని అమెరికా ఎంబసీపై జరిగిన బాంబు దాడి కేసు నిందితుడు ఇబ్రహీం అఖిల్ ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అతన్ని మరణాన్ని హిజ్బుల్లా ద్రువీకరించింది. ఓ గొప్ప జిహాదీ నేతను కోల్పోయినట్లు హిజ్బొల్లా ప్రకటించింది. అఖిల్ తలపై ఏడు మిలియన్ డాలర్ల నజరానా అమెరికా ప్రకటించింది 1983 బాంబు దాడి ఘటనలో అనేక మంది అమెరికన్లు మృతిచెందారు. 1980లో అమెరికా,యురోపియన్లను కిడ్నాప్ చేసిన కేసు కూడ ఉన్నది.