శనివారం 06 జూన్ 2020
International - Apr 20, 2020 , 10:09:58

ఆసియా ఏనుగు తొలి ఫొటో ఇదేన‌ట‌..!

ఆసియా ఏనుగు తొలి ఫొటో ఇదేన‌ట‌..!

ఆధునిక టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత మ‌ల్టీ డైమ‌న్ష‌న్ లో దృశ్యాల‌ను బంధించే కెమెరాలు వచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడైతే త‌మ కెమెరాల్లో ఎన్నో ర‌కాల వన్య‌ప్రాణుల ఫొటోల‌ను చిత్రీక‌రిస్తున్నారు. మ‌రి చాలా ఏళ్ల కింద‌ట‌ బ్లాక్ అండ్ వైట్ కాలంలో తీసిన ఫొటోలు కొన్ని ఇప్పటికీ, ఎప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ గా నిలుస్తుంటాయి. అలాంటిదే ఈ ఫొటో.

ఈ ఫొటోలో క‌నిపిస్తుంది మొట్ట‌మొదటిసారిగా కెమెరాల్లో బంధించబ‌డిన ఆసియా ఏనుగుద‌ట‌. థామస్ ఈస్ట‌ర్నీ అనే ఫొటోగ్రాఫ‌ర్ 1850లో ఇట‌లీలో ఈ ఏనుగును ఫొటో తీశాడు. డాగ్‌యెర్రియాటైప్ (తొలి క‌మ‌ర్షియ‌ల్‌ ఫొటోగ్రాఫిక్ విధానం) ద్వారా ఈ ఫొటోను చిత్రీక‌రించారు. లూయిస్ డాగ్‌యెర్రే అనే ఫ్రెంచి ఆర్టిస్ట్, ఫొటోగ్రాఫ‌ర్ ఈ విధానాన్ని తొలిసారి ప్ర‌వేశ‌పెట్టాడు.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo