అంకారా: వైద్యులతో బయల్దేరిన అంబులెన్స్ హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైంది. రోగిని తీసుకొచ్చేందుకు టేకాఫ్ అయిన హెలికాప్టర్ హాస్పిటల్ భవనాన్ని ఢీకొట్టి, కుప్పకూలింది. అందులో ఉన్న ఇద్దరు పైలట్లు, ఒక డాక్టర్, ఒక ఆరోగ్య సంరక్షకుడు చనిపోయారు. టర్కీ ఆగ్నేయప్రాంతంలోని ముగ్లా నగరంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
అంట్యాలా ప్రావిన్స్‌లో ఉన్న రోగిని దవాఖానకు తరలించేందుకు అంబులెన్స్ హెలికాప్టర్ బయల్దేరగా, కొద్ది నిమిషాలకే కుప్పకూలింది. టేకాఫ్ అవుతున్న సమయంలో దట్టమైన పొగమంచు ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ముగ్లా నగర గవర్నర్ ఇడ్రిస్ అక్బియాక్ తెలిపారు.