మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)పై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. పుతిన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై డ్రోన్ల దాడి జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వస్తున్న డ్రోన్ల మధ్యలో పుతిన్ హెలికాప్టర్ చిక్కుకున్నట్లు చెప్పారు. అయితే ఆ దాడి నిజమే అని ఎయిర్ డిఫెన్స్ డివిజన్ కమాండర్ యురీ దాస్కిన్ తెలిపారు.
గత మంగళవారం కుర్క్స్ ప్రాంతంలో పుతిన్ పర్యటించారు. ఏప్రిల్‌లో ఉక్రెయిన్ దళాల నుంచి ఆ ప్రాంతం విముక్తి పొందింది. ఈ నేపత్యంలో ఆ ప్రాంతాన్ని పుతిన్ విజిట్ చేశారు. తన పర్యటన సమయంలో గవర్నర్ అలెగ్జాండర్ కిన్షెటిన్ను కలివారు. అయితే ఆ సమయంలో ఉక్రెయిన్ డ్రోన్లు.. పుతిన్ హెలికాప్టర్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
ఛానల్ రష్యా 1కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శత్రు దేశం డ్రోన్లతో దాడి చేసిందని, ఆ దాడి సమయంలో పుతిన్ తన హెలికాప్టర్లో ఉన్నారని, సమర్థవంతంగా తమ దళాలు ఆ డ్రోన్ దాడిని తిప్పికొట్టినట్లు కమాండర్ దాస్కిన్ తెలిపారు. కుర్క్స్ ప్రాంతంలో పుతిన్ పర్యటిస్తున్న సమయంలో.. అసాధారణ రీతిలో యూఏవీలను ఉక్రెయిన్ వదలింది. అయితే తమ దళాలు 46 యూఏవీలను కూల్చినట్లు రష్యా కమాండర్ పేర్కొన్నారు.
డ్రోన్ల దాడి సయమంలో తమ వైమానిక రక్షణ దళాలు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ కంబాట్ విన్యాసాలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రెసిడెంట్ హెలికాప్టర్ క్షేమంగా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. శత్రు డ్రోన్లను తిప్పికొట్టామని, ఏరియల్ టార్గెట్లను పేల్చివేసినట్లు దాస్కిన్ తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు సుమారు 764 ఉక్రెయిన్ డ్రోన్లను నేలకూల్చినట్లు రష్యా పేర్కొన్నది. శనివారం, ఆదివారం కూడా వందల సంఖ్యలో మానవరహిత వైమానిక వాహనాలను ధ్వంసం చేసినట్లు చెప్పారు. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఈయూ దేశాల సహకారంతో రష్యాపై దాడులకు ఉక్రెయిన్ తెగిస్తున్నట్లు విదేశాంగ మంత్రి తెలిపారు.
Ukraine tried to ATTACK Putin’s helicopter mid-flight over Kursk
Russian Air Defense Division officer says Ukrainian drones attempted to swarm chopper flight path
Russian air defenses scrambled — worked perfectly and repelled the strike pic.twitter.com/BDmmrLMyvU
— RT (@RT_com) May 25, 2025