కీవ్: రష్యా తన దూకుడు పెంచింది. కీవ్ నగరంపై నిన్న రాత్రి భారీ స్థాయిలో దాడులు చేసింది. నివాస ప్రాంతంలో ఉన్న ఓ బిల్డింగ్‌పై ఫైరింగ్ చేసింది. ఆ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. రెండు మృతదేహాలను గుర్తించినట్లు ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీస్ పేర్కొన్నది. 9 అంతస్తుల భవనం నుంచి భారీ స్థాయిలో పొగలు వస్తున్న ఫోటోలను రిలీజ్ చేశారు. ఆ బిల్డింగ్‌లో దాచుకున్న వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దూకింది.
ఇక కీవ్‌లో ఉన్న ఆంటనోవ్ విమానాశ్రయంపై కూడా దాడి జరిగింది. రష్యా వైమానిక దళం భీకర దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆంటనోవ్ను హోస్టోమెల్ ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తారు. ఇది అంతర్జాతీయ కార్గో ఎయిర్పోర్ట్. అంతే కాకుండా సైనిక ఎయిర్‌బేస్ కూడా. ఎయిర్పోర్ట్ నుంచి భారీ స్థాయిలో పొగ, మంటలు వెలుబడుతున్న ఫోటోలను రిలీజ్ చేశారు.
కీవ్‌కు పశ్చిమ దిక్కున రివ్నీ వద్ద ఉన్న టీవీ టవర్‌ను పేల్చేసినట్లు ఉక్రెయిన్ మీడియా పేర్కొన్నది. మిసైల్ అటాక్‌లో ఆ టవర్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. రివ్నీ నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో టీవీ టవర్ ఉన్్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.