Landslides : ఆఫ్రికా దేశమైన కెన్యా (Kenya) లో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 21 మంది మరణించారు. మరో 30 మందికిపైగా గల్లంతయ్యారు. దక్షిణ కెన్యా (South Kenya) ప్రాంతంలోని మారాక్వెట్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడ్డాయని కెన్యా అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించారు.
ఈ ఘటనలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని సదరు మంత్రి తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ వర్షాకాలం కావడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు.