Vladimir Putin | ప్రిగోజిన్ శరీరంలో గ్రనేడ్ అవశేషాలు.. వాగ్నర్ చీఫ్ మృతిపై తొలిసారి స్పందించిన పుతిన్
Vladimir Putin | రష్యా (Russia)పై తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ (Wagner Chief) ప్రిగోజిన్ (Yevgeny Prigozhin) మృతిపై పుతిన్ తాజాగా తొలిసారి స్పందించారు. ఆయన ప్రయాణిస్తున్న విమానంపై బయటి నుంచి ఎలాంటి దాడీ జరగలేదని స్పష్టం చేశారు. ప్రిగోజిన్‌తో పాటు ఆ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి శరీరాల్లో గ్రనేడ్ అవశేషాలను గుర్తించినట్లు (Hand Grenade Fragments Found) చెప్పారు.
Vladimir Putin | రష్యా (Russia)పై తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ (Wagner Chief) ప్రిగోజిన్ (Yevgeny Prigozhin) ఇటీవలే విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. మాస్కో నుంచి సెయింట్ పీట్స్‌బర్గ్ వెళుతున్న ఒక ప్రైవేట్ విమానం మాస్కో ఉత్తర ప్రాంతంలోని ట్విర్ రీజియన్‌లో కూలిపోయింది. ప్రమాదంలో ప్రిగోజిన్ సహా 10 మంది మరణించారు. అయితే, వాగ్నర్ చీఫ్ మరణం వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) హస్తం ఉందని పలువురు అనుమానాలూ వ్యక్తం చేశారు. పుతిన్‌పై తిరగబడినందుకే ఆయన్ని అంతమొందించారని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఘటన జరిగిన రెండు నెలల తర్వాత ప్రిగోజిన్ మృతిపై పుతిన్ తాజాగా తొలిసారి స్పందించారు. ఆయన ప్రయాణిస్తున్న విమానంపై బయటి నుంచి ఎలాంటి దాడీ జరగలేదని స్పష్టం చేశారు. ప్రిగోజిన్‌తో పాటు ఆ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి శరీరాల్లో గ్రనేడ్ అవశేషాలను గుర్తించినట్లు (Hand Grenade Fragments Found) చెప్పారు. దీంతో వారు ప్రయాణిస్తున్న విమానంలో గ్రనేడ్ పేలి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవలే జరిగిన వార్షిక సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. ‘ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానంపై బయట నుంచి ఎలాంటి దాడీ జరగలేదు. విమాన ప్రమాదానికి సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ కమిటీ కొన్ని రోజుల క్రితం నాకు నివేదిక అందించింది. అందులో మృతి చెందిన వారి శరీరాల్లో హ్యాండ్ గ్రనేడ్ల శకలాలు కనుగొనబడ్డాయి. దీన్ని బట్టి చూస్తే విమానంలో గ్రనేడ్ పేలడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకొని ఉండొచ్చు’ అని పుతిన్ పేర్కొన్నారు.
ప్రిగోజిన్ తన జీవితంలో ఎన్నో తీవ్రమైన తప్పులు చేశాడని పుతిన్ వ్యాఖ్యానించారు. అయితే, అతడు తప్పులు చేసినప్పటికీ సరైన ఫలితాలను రాబట్టాడని మెచ్చుకున్నారు. ఇక ఇదే సందర్భంగా విమాన ప్రమాదంపై విచారణ జరుపుతున్న అధికారులపై పుతిన్ విమర్శలు గుప్పించారు. ప్రిగోజిన్ సహా ఇతరుల శరీరాలకు ఆల్కహాల్, డ్రగ్ టెస్టులు జరపకపోవడాన్ని తప్పుబట్టారు.
Also Read..
Air India | విమానంలో తోటి ప్రయాణికులు, క్రూ సిబ్బంది పట్ల అసభ్యకర ప్రవర్తన.. వ్యక్తి అరెస్ట్
Turkish Drone | నాటో మిత్రదేశమైన తుర్కియే డ్రోన్‌ను కూల్చివేసిన అమెరికా.. వీడియో
Syrian Military Academy | సిరియా మిలటరీ అకాడమీపై బాంబుల వర్షం.. 100 మందికిపైగా మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
Explosion In Building | నిర్మాణంలో ఉన్న భవనంలో పేలుడు.. ఐఈడీగా పోలీసులు అనుమానం
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి.. 15 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

