Syrian Military Academy | సిరియా మిలటరీ అకాడమీపై బాంబుల వర్షం.. 100 మందికిపైగా మృతి
Syrian Military Academy | బాంబుల వర్షంతో సిరియా (Syria) దద్దరిల్లింది. హోమ్స్ ప్రావిన్స్ (Homs Province)లోని మిలటరీ అకాడమీ (Syrian Military Academy)పై డ్రోన్ల దాడి (Drone Attack ) జరిగింది. ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
Syrian Military Academy | బాంబుల వర్షంతో సిరియా (Syria) దద్దరిల్లింది. హోమ్స్ ప్రావిన్స్ (Homs Province)లోని మిలటరీ అకాడమీ (Syrian Military Academy)పై డ్రోన్ల దాడి (Drone Attack ) జరిగింది. ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 125 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గురువారం హోమ్స్ ప్రావిన్స్‌లో సైనిక కళాశాల స్నాతకోత్సవం జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో మిలటరీ సిబ్బంది సహా వారి కుటుంబ సభ్యులు, సాధారణ పౌరులు కూడా ఉన్నారు.
కార్యక్రమంలో ఆదేశ రక్షణ మంత్రి కూడా పాల్గొన్నారు. అయితే ఆయన వెళ్లిపోయిన కొద్ది నిమిషాల్లోనే ఈ దాడి జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మిలటరీ అకాడమీని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినట్లు సిరియా మిలటరీ పేర్కొన్నట్లు పేర్కొంది. కార్యక్రమం ముగింపు సమయంలో ఆ ప్రాంతంలో డ్రోన్లు బాంబులను జారవిడిచాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా భయంకరంగా మారిపోయింది. ఎక్కడ చూసినా రక్తం మడుగుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి కనిపిస్తున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఘటనలో గాయపడిన వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించారు.
కాగా, సిరియాలో గత 12 ఏళ్లుగా అంతర్యుద్ధం జరుగుతున్నప్పటికీ డ్రోన్లతో బాంబు దాడులు చేయడం గతంలో ఎన్నడూ చోటుచేసుకోలేదు. సాయుధ డ్రోన్లు రంగ ప్రవేశం చేయడంతో ఆందోళన నెలకొంది. ఇవి ఎక్కడ నుంచి వచ్చాయన్నది ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు ఇప్పటి వరకూ ఎవరూ బాధ్యత వహించలేదు.
Also Read..
Rachin Ravindra: రాహుల్ ద్రావిడ్ + సచిన్ టెండూల్కర్ = రచిన్ రవీంద్ర
Asian Games: బంగ్లాపై 9 వికెట్ల తేడాతో విక్టరీ.. ఆసియా గేమ్స్ ఫైనల్లోకి భారత్
Mumbai | ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

