Asian Games: బంగ్లాపై 9 వికెట్ల తేడాతో విక్టరీ.. ఆసియా గేమ్స్ ఫైనల్లోకి భారత్
Asian Games: ఆసియా గేమ్స్ క్రికెట్ ఈవెంట్లో ఇండియా ఫైనల్లోకి ఎంటరైంది. సెమీస్‌లో బంగ్లాపై 9 వికెట్ల తేడాతో నెగ్గింది. 96 రన్స్ టార్గెట్‌ను ఈజీగా అందుకున్నది. దీంతో ఇండియాకు క్రికెట్ విభాగంలో మెడల్ దక్కడం ఖాయమైంది.
హాంగ్జూ: ఆసియా క్రీడల్లో ఇండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన సెమీస్ మ్యాచ్‌లో.. బంగ్లాదేశ్‌పై 9 వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 రన్స్ మాత్రమే చేసింది. ఆ తర్వాత స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్.. ఈజీగా ఆ లక్ష్యాన్ని అందుకున్నది. 9.2 ఓవర్లలోనే టార్గెట్‌ను చేధించింది. రుతురాజ్ 40, తిలక్ వర్మ 55 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచారు. క్వార్టర్స్‌లో సెంచరీ కొట్టిన జైస్వాల్ ఈ మ్యాచ్‌లో డకౌటయ్యాడు. అంతకుముందు భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. సాయి కిషోర్ తన ఖాతాలో మూడు వికెట్లు వేసుకున్నాడు. ఇక సుందర్‌కు రెండు వికెట్లు దక్కగా, మరో నలుగు బౌలర్లు ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. తిలక్ వర్మ 26 బంతుల్లో రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 55 రన్స్ చేయగా.. రుతురాజ్ 26 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 40 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | నిన్న ఖజాన, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

