Hafiz Saeed | పాక్ ఎన్నికల్లో ఓటమి పాలైన ఉగ్రవాది హఫీజ్ సయీద్ కుమారుడు
Hafiz Saeed | పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ కుమారుడు తల్హ సయీద్ ఓటమి పాలయ్యారు. లాహోర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన సయీద్.. పాకిస్తాన్ మాజీ ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి చేతిలో తల్హ సయీద్ ఓటమి చవిచూశారు.
Hafiz Saeed | ఇస్లామాబాద్ : పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తుది ఫలితాలు వెలువడేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కుమారుడు తల్హ సయీద్ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. లాహోర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. అయితే పాకిస్తాన్ మాజీ ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి చేతిలో తల్హ సయీద్ ఓటమి పాలయ్యారు.
తల్హ సయీద్‌ను ఉగ్రవాదిగా గతేడాది భారత్ గుర్తించింది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో తల్హ సయీద్ క్లరికల్ వింగ్ హెడ్‌గా కొనసాగుతున్నాడు. అయితే ఉగ్రవాది తల్హ సయీద్ పాక్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడాన్ని భారత్ ఖండించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తే జాతీయ భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

