శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
International - Jan 17, 2021 , 14:26:45

కాల్పుల్లో ఇద్దరు సుప్రీంకోర్టు మహిళా జడ్జీలు మృతి

కాల్పుల్లో ఇద్దరు సుప్రీంకోర్టు మహిళా జడ్జీలు మృతి

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో హత్యాకాండ కొనసాగుతున్నది. ఆయుధాలు ధరించిన వ్యక్తులు సుప్రీంకోర్టు మహిళా జడ్జీలపై కాల్పులు జరుపడంతో ఇద్దరు మరణించారు. ఆ దేశ రాజధాని కాబూల్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. కోర్టు వాహనంలో కార్యాలయానికి వెళ్తున్న ఇద్దరు సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వారిద్దరు మరణించగా వాహనం డ్రైవర్‌ గాయపడినట్లు సుప్రీంకోర్టు ప్రతినిధి అహ్మద్ ఫాహిమ్ క్వావీమ్ తెలిపారు. ఆ దేశ సర్వోన్నత కోర్టులో 200 మంది మహిళా న్యాయమూర్తులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

మరోవైపు కాబూల్‌ పోలీసులు కూడా ఈ దాడిని ధ్రువీకరించారు. తాలిబన్ల పనిగా అనుమానం వ్యక్తం చేయగా ఆ సంస్థ ఖండించింది. ఓ వైపు తాలిబన్‌, ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు కొనసాగుతుండగా మరోవైపు హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఉన్నత హోదాలోని వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడంపై ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo