వాషింగ్టన్: క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఒక మాల్లో కాల్పులు జరిగాయి. (Gunfire at US mall) ఈ సంఘటనలో ఒకరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికాలోని కొలరాడోలో ఈ సంఘటన జరిగింది. క్రిస్మస్ నేపథ్యంలో ఆదివారం రద్దీగా ఉన్న కొలరాడో స్ప్రింగ్స్‌లోని సిటాడెల్ మాల్లో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కాల్పులు జరిగాయి. ఒక వ్యక్తి మరణించగా, ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ సంఘటన కలకలం రేపింది.
కాగా, ఈ కాల్పుల సంఘటనలో మరో మహిళకు స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. పలువరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ మాల్‌ను ఖాళీ చేయించి మూసివేసినట్లు వెల్లడించారు. మరోవైపు కాల్పుల సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#BREAKING : Gunfire erupts at a Colorado mall on Christmas Eve, one dead, three injured#Colorado #citadelmall #Shooting #Gunfire #Shooter #Christmas2023 #activeshooter pic.twitter.com/1XUzPbSJ4P
— mishikasingh (@mishika_singh) December 25, 2023