అమెరికాలో భారత వ్యాపారి హత్య.. కుమార్తె కండ్ల ముందే కాల్పులు
అమెరికాలో గన్ కల్చర్, దోపిడీకి మరో భారతీయుడు బలయ్యాడు. అక్కడ ఓ దుకాణాన్ని నడుపుతున్న భారతీయుడ్ని గుర్తు తెలియని దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఆగస్టు 20న టెన్నెస్సీ రాష్ట్రం జాక్సన్ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో గుజరాత్లోని మెహ్సానాకు చెందిన సురేశ్ పటేల్ (56) ప్రాణాలు కోల్పోయాడు.
వాషింగ్టన్, ఆగస్టు 23 : అమెరికాలో గన్ కల్చర్, దోపిడీకి మరో భారతీయుడు బలయ్యాడు. అక్కడ ఓ దుకాణాన్ని నడుపుతున్న భారతీయుడ్ని గుర్తు తెలియని దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఆగస్టు 20న టెన్నెస్సీ రాష్ట్రం జాక్సన్ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో గుజరాత్లోని మెహ్సానాకు చెందిన సురేశ్ పటేల్ (56) ప్రాణాలు కోల్పోయాడు. దోపిడీ చేయడానికి దుకాణంలో చొరబడిన దుండగుడు.. అక్కడ ఉద్యోగి నుంచి డబ్బు తీసుకున్న తర్వాత సురేశ్ పటేల్పై పలుమార్లు కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అతడి 19 ఏండ్ల కుమార్తె కండ్లముందే ఈ ఘటన చోటుచేసుకుందని సమాచారం. పటేల్ రిడ్జ్ క్రెస్ట్ సెల్లార్స్ పేరుతో కొద్ది రోజుల క్రితమే ఇక్కడ కొత్త దుకాణాన్ని తెరిచాడు.
పిజ్జా డెలివరీకీ వెళ్తుండగా భారతీయుడి కాల్చివేత
అమెరికాలోని న్యూయార్క్లో శుక్రవారం పిజ్జా డెలివరీకి వెళ్తున్న భారత యువకుడు హత్యకు గురయ్యాడు. మృతుడిని గుర్దీప్ సింగ్ గా గుర్తించారు. గుర్దీప్ 2017లో అమెరికా వెళ్లాడు. పంజాబ్లోని కపుర్తాలా జిల్లాలోని జబోవాల్ అతడి స్వగ్రామం. డంకీ మార్గంలో అక్రమంగా అతడు అమెరికా వెళ్లాడు. శుక్రవారం అతడు గుర్తు తెలియని వ్యక్తి చేతిలో హత్యకు గురయ్యే ముందు ఓ వ్యక్తితో గొడవ జరగడం సీసీటీవీ కెమెరాలో రికాైర్డెంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

