న్యూఢిల్లీ : మాజీ బాయ్‌ఫ్రెండ్ అంత్యక్రియల కోసం 92 ఏండ్ల బామ్మ పొందికైన డ్రెస్‌తో ముస్తాబై మేకప్ చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బామ్మ డ్రోనియక్ ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. వీడియోలో తాను 92 ఏండ్ల మహిళా సెలబ్రిటీనని ఆమె పరిచయం చేసుకున్నారు.
ఈ క్లిప్‌లో బామ్మ తన మాజీ బాయ్‌ఫ్రెండ్ బ్రూస్ అంత్యక్రియల సందర్భంగా మేకప్ చేసుకుంటూ కనిపించారు. ఆమె తన ముఖంపై పౌడర్ రాసుకుని లిప్‌స్టిక్ పెట్టుకుంటూ కనిపించారు. తాను ఎక్కువ మేకప్ వేసుకోవాలనుకోవడం లేదని, తానే అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకోవడం లేదని ఆమె చెప్పుకొచ్చారు.
ఆపై బ్రూస్ అంత్యక్రియల కోసం సిద్ధమయ్యా..ఆర్ఐపీ బ్రూస్ అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఆన్లైన్లో షేర్ చేసిన అనంతరం ఈ వీడియోను 20 లక్షల మందికి పైగా వీక్షించారు. కేవలం రెండు సెకండ్లలో బామ్మ లిప్‌స్టిక్ ఎలా పూర్తిచేశారో అర్ధం కాలేదని..ఇది అద్భుతం అని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఈ మహిళలో తాను తన భవిష్యత్ చూసుకుంటున్నానని మరో యూజర్ రాసుకురాగా, ఇక అప్పట్లో బామ్మ రేంజ్ మామూలుగా లేదేమో అని మరో యూజర్ కామెంట్ చేశారు.