ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఈశ్వరీపూర్లో ఉన్న జెశోరేశ్వరీ కాళీమాత ఆలయానికి భారత ప్రధాని నరేంద్రమోదీ బహూకరించిన కిరీటం చోరీకి గురైంది. మూడేండ్ల క్రితం బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా మోదీ ఈ కిరీటాన్ని బహూకరించారు. గురువారం ఈ కిరీటం అపహరణకు గురైనట్టు తెలుస్తున్నది. దీనిపై బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘బంగ్లాదేశ్ ప్రభు త్వం వెంటనే దర్యాప్తు జరిపి కిరీటాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాం’ అని ఢాకాలోని భారత దౌత్య కార్యాలయం ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టింది.