Glasgow Gurdwara | భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామిని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించిన గ్లాస్గో గురుద్వారా
భారత రాయబారిని గురుద్వారాలోకి రాకుండా అడ్డుకోవడాన్ని గ్లాస్గో గురుద్వారా (Glasgow Gurdwara) తీవ్రంగా ఖండించింది. ఇది అక్రమమైన ప్రవర్తన అని, అన్ని వర్గాల ప్రజల కోసం గురుద్వారా తెరచేఉంటుందని ప్రకటించింది.
గ్లాస్గో: భారత రాయబారిని గురుద్వారాలోకి రాకుండా అడ్డుకోవడాన్ని గ్లాస్గో గురుద్వారా (Glasgow Gurdwara) తీవ్రంగా ఖండించింది. ఇది అక్రమమైన ప్రవర్తన అని, అన్ని వర్గాల ప్రజల కోసం గురుద్వారా తెరచేఉంటుందని ప్రకటించింది. ఈ మేరకు గ్లాస్కో గురుద్వారా గురు గ్రంథ్ సాహిబ్ సిఖ్ సభ ప్రకటన విడుదల చేసింది. రెండు రోజుల క్రితం (శుక్రవారం) లండన్‌లోని భారత హైకమిషనర్ (Indian High Commissioner) విక్రమ్ దొరైస్వామి (Vikram Doraiswami) గురుద్వారా కమిటీ సమాశేంలో పాల్గొనేందుకు స్కాట్లాండ్లోని గ్లాస్గో (Glasgow) వెళ్లారు. ఈ సందర్భంగా గురుద్వారా సమీపంలో ఆయనను ఖలిస్థానీ మద్దతుదారులు (Khalistani extremists) అడ్డుకున్నారు. ఆహ్వానం లేదంటూ వెనక్కి పంపించారు. బ్రిటన్‌లోని ఏ గురుద్వారాలోనూ భారత అధికారులకు అనుమతి లేదన్నారు.
అయితే ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించిందంచిన విషయం తెలిసిందే. ఇది అవమానకర చర్యగా పేర్కొంది. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు బ్రిటన్ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లింది. బ్రిటన్ స్పందిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భారత్‌కు హామీ ఇచ్చింది. భారతీయులను గురుద్వారాలకు వెళ్లకుండా ఎవరూ అడ్డుకోలేరని, అందరికీ ఆహ్వా నం ఉంటుందని పేర్కొంది. కొంతమంది ప్రచారం కోసం ఈ చర్యలకు పాల్పడ్డారని తెలిపింది.
తాజాగా గురుద్వారా ఈ చర్యను తీవ్రంగా తప్పుపట్టింది. సెప్టెంబర్ 29న స్కాటిష్ పార్లమెంట్ సభ్యుడి ఆహ్వానం మేరకు భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి గ్లాస్గో గురుద్వారా సందర్శణకు వచ్చినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. గురుద్వారా వెలుపల ఆయనను పలువురు గుర్తుతెలియని వ్యక్తులు అడ్డుకున్నారు. దీంతో యాన అక్కడి నుంచి వెళ్లిపోయారని గ్లాస్గో గురుద్వారా ఆ ప్రకటనలో వెల్లడించింది. భారత రాయబారి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ వికృత స్వభావం కలిగిన వ్యక్తులు తర్వాత కూడా దానిని కొనసాగించారని తెలిపింది. అయితే సిక్కుల పవిత్ర ప్రార్థనా స్థలమైన గురుద్వారాలో ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించడాన్ని తీవ్రంగా ఖడిస్తున్నామని వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

