విక్టోరికా: కో ఎడ్యుకేషన్ విద్యాసంస్థల్లో చదివిన బాలికల కంటే ప్రత్యేక బాలికల పాఠశాలల్లో చదివిన అమ్మాయిలు పరీక్షల్లో కొంత మెరుగైన ప్రతిభ కనబర్చినట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. విద్యావిధానంపై పరిశోధనలు జరిపే లండన్‌కు చెందిన స్వతంత్ర సంస్థ ఎఫ్ఎఫ్టీ ఎడ్యుకేషన్ డాటాల్యాబ్ యూకే జాతీయ విద్యార్థుల డాటాను ఉపయోగించి ఈ అధ్యయనం జరిపింది. ప్రభుత్వ నిధులతో నడిచే 3,200 పాఠశాలకు హాజరైన 5.80 లక్షల మంది విద్యార్థులపై అధ్యయనం జరిపింది. ప్రత్యేక గర్ల్స్ స్కూళ్లలో చదివిన విద్యార్థినులు కో ఎడ్యుకేషన్‌లో చదివిన విద్యార్థినుల కంటే 11వ తరగతి పరీక్ష ఫలితాల్లో కాస్త మెరుగైన ఫలితాలు కనబర్చినట్టు అధ్యయనంలో తేలింది. అయితే, ప్రత్యేక బాలుర పాఠశాలల్లో చదివిన అబ్బాయిలు, కో ఎడ్యుకేషన్ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు ఫలితాల్లో మాత్రం ఎలాంటి తేడా కనిపించలేదని వెల్లడైంది. అబ్బాయిలు ప్రత్యేక బాలుర పాఠశాలల్లో చదివినా, కోఎడ్యుకేషన్ విద్యాసంస్థల్లో ఫలితాల్లో ఎలాంటి తేడా ఉండటం లేదని తాజా పరిశోధనలో తేలింది.