బీజింగ్: కమ్యూనిస్టు దేశం చైనాలో షాకింగ్ ఘటన చోటుచేసుకున్నది. రాజధాని బీజింగ్‌కు దక్షిణాన ఉన్న నింగ్బో పట్టణంలోని ఓ జంక్షన్లో సిగ్నల్ పడింది. దీంతో వాహనాలు తమ వంతు కోసం ఆగిఉన్నాయి. ఈ క్రమంలో ఓ కారు వెనక డోరులో నుంచి చిన్నారి తల బయటకు పెట్టి చూస్తున్నది. ఇంతలో గ్రీన్ సిగ్నల్ రావడంతో డ్రైవర్ కారును ముందుకు కదిలించాడు. దీంతో ఆ చిన్నారి కారులో నుంచి కిందపడిపోయింది. అయితే ఇది గమనించకుండా డ్రైవర్ వెళ్లిపోయాడు. కిందపడిపోయిన ఆ బాలిక షాక్‌లో ఏడుస్తూ అలాగే ఉండిపోయింది.
అయితే వెనుక వస్తున్న కారు డ్రైవర్ అది గమనించి.. వాహనాన్ని ఆపాడు. ఆమెను ఫుట్‌పాత్‌పైకి తీసుకెళ్లాడు. ఇదంతా ఆ జంక్షన్లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. కాగా, ఆ చిన్నారికి ఎలాంటి ప్రమాదం జరుగలేదని, చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని స్థానిక మీడియా ఎస్సీఎంపీ తెలిపింది. ప్రస్తుతం ఆమె బాగానే ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ షేరింగ్ అవుతున్నది.
Heights of Careless parents.#China – Child falls out of #car window in Ningbo, China. pic.twitter.com/rowxkQL62P
— Siraj Noorani (@sirajnoorani) August 3, 2022